32 Missing After Andhra Tourist Boat Capsizes in Swollen Godavari || నిండు గోదారిలో మృత్యు ఘోష

2019-09-16 1,489

‘అన్నా.. అటు చూడు.. ఆ కొండ ఎంత బావుందో.. అక్కా.. ఇటు చూడు ఎన్ని నీళ్లో..’ అంటూ బంధు మిత్రులతో కలిసి పాపికొండల అందాలను వీక్షిస్తూ కేరింతలు కొట్టిన పర్యాటకులు అంతలోనే కాపాడండంటూ హాహాకారాలు చేశారు. రెప్పపాటులో నీట మునగడంతో ప్రాణ భయంతో గావు కేకలు పెట్టారు. భర్త ఒక వైపు.. భార్య మరో వైపు.. కొట్టుకుపోతుంటే అవే వారికి చివరి చూపులయ్యాయి.. మాటలకందని ఈ విషాద ఘటనలో 12 మంది విగతజీవులవ్వగా, 27 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన దాదాపు 37 మంది కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ‘దేవుడా.. మా నాన్నను మా వద్దకు ప్రాణాలతో చేర్చు.. స్వామీ మా అమ్మను బతికించు.. భగవంతుడా.. మా అన్నను సజీవంగా మా ఇంటికి చేర్చు.. ఈ జీవితానికి ఇదే మా ఆఖరు కోరిక..’ అంటూ వారు గోదారి ఒడ్డున గుండెలవిసేలా ఏడుస్తున్నారు. నా భర్త, బిడ్డ వెళ్లిపోయారు.. ఇక నేనెందుకు బతకాలి దేవుడా.. అంటూ మామ అస్థికలను గోదావరిలో కలపడానికి తిరుపతి నుంచి వచ్చిన మాధవీలత కన్నీరుమున్నీరుగా విలపించింది. వీరందరినీ ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

#godavari
#river
#boat
#capsize
#andhrapradesh
#touristboat
#Devipatnam
#Kacchuluru
#papikondalu
#telangana
#apcmjagan